ఖతార్ , ఈజిప్టు మధ్యవర్తిత్వంతో కుదిరిన అంగీకారం -Tv9

ఇజ్రాయెల్‌, హమాస్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం మరో 2 రోజులు కొనసాగనుంది. ముందుగా కుదుర్చుకున్న నాలుగు రోజుల ఒప్పందం సోమవారంతో ముగియడంతో ఖతార్‌, ఈజిప్టు మధ్యవర్తిత్వంతో 2 రోజుల పొడిగింపునకు రెండు వర్గాలు అంగీకరించాయి. ఈ ఒప్పందం ప్రకారం.. హమాస్‌ ప్రతి రోజూ 10 మంది ఇజ్రాయెలీలను విడిచి పెట్టాల్సి ఉంటుంది. ప్రతి ఒక్క బందీకి బదులుగా.. ముగ్గురు పాలస్తీనా వాసులను ఇజ్రాయెల్‌ వదలాల్సి ఉంటుంది.