'అల వైకుంఠపురంలో..' తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తోన్న సినిమా గుంటూరు కారం. ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. అతడు, ఖలేజా వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో వస్తోన్న ఈ సినిమా పై అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. కుర్చీ మడతబెట్టి పాట కూడా రీసెంట్‌గా ఈ సినిమాకు హోవీ బజ్ వచ్చేలా చేసింది. ఇక పండగ పూట.. జనవరి 12న ఈ సినిమా రిలీజ్ అవ్వడమే ఆలస్యం. హిట్ కొట్టుడు పక్కా అనే టాక్ అంతటా వినిపిస్తోంది. అంతేకాదు.. ఇప్పటికే ప్రిన్స్ అభిమానుల సెలబ్రేషన్స్ కూడా మొదలైపోయింది.