కర్ణాటకలోని బాగల్‌కోట్ జిల్లా జమఖండి తాలూకా కంకన్‌వాడి గ్రామంలో దాదాపు 300 మంది జనాభా ఉంటారు. రాష్ట్రంలో గత కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ ప్రభుత్వాలు మారాయి.. నాయకులు మారారు. అయినా వారి గ్రామం పక్కన ఉండే కృష్ణా నది దాటి తమ వ్యవసాయ భూముల్లోకి వెళ్లేందుకు అవసరమైన వంతెన కష్టం మాత్రం తీరలేదు. పాలకులు పట్టించుకోకపోవడంతో విసుగెత్తిన గ్రామస్థులు, రైతులు.. తమకు తాముగానే దాదాపు రూ.24 లక్షల వరకు చందాలు వేసుకొని కర్రల వంతెన నిర్మించుకున్నారు.