ఉన్నదున్నట్టు... మనసుకు ఏది అనిపిస్తే అది చెప్పేస్తూ ఉంటారు ఆర్జీవీ. అది కాంట్రవర్సీయే కానీ.. తనను కదిలించిన విషయమే కానీ.. మొహమాటానికి పోకుండా... సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌కు పంచుకుంటూ ఉంటారు. ఈ సారి కూడా అదే చేశారు. ఒక అందగత్తె ఫోటో.. తన కళ్లలో నుంచి నీళ్లు వచ్చేలా చేసిందంటూ తన ఇన్‌స్టా పోస్ట్‌లో రాసుకొచ్చారు. టాలీవుడ్ సెన్సెషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ.. శ్రీదేవికి వీరాభిమాని అన్న సంగతి తెలిసిందే.