చేపలు పట్టాలంటే సముద్రం, నదులు, చెరువుల దగ్గరికో వెళ్లాలి. లేదా మత్సకారులు పడవల సాయంతో సముద్రంలోకి వెళ్లి చేపలు పడతారు. కానీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం చేతికి దొరికేస్తున్నాయి. చేపలంటే చిన్నాచితకా చేపలు కాదు. ఏకంగా 10 నుంచి 20 కిలోలు ఉన్న చేపలు ఈ వరదలకు కొట్టుకొస్తున్నాయి. మహారాష్ట్రాలో కురుస్తున్న వర్షాలతో ఆదిలాబాద్ జిల్లాలోని వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.