బాలయ్య షోకి వెంకీ..! పోలే.. అదిరిపోలే..!

ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో.. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు, అదిరిపోయే వెబ్ సిరీస్ లు అందుబాటులో ఉన్నాయి. అలాగే అదిరిపోయే టాక్ షోలు, ఆకట్టుకునే గేమ్ షోలు, సింగింగ్ షోలతో ప్రేక్షకులను అలరిస్తోంది ఆహా.. వీటన్నింటితో పాటే.. ఆహాలో వస్తోన్న క్రేజీయెస్ట్ టాక్ షో అన్‌స్టాపబుల్. నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ చేసే ఈ షో ఇప్పటికే సక్సెస్‌ ఫుల్‌గా రన్‌ అవుతోంది. అందర్నీ విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇక ఈక్రమంలోనే ఈ షోలోకి హీరో విక్టరీ వెంకటేష్ వస్తుండడం ఇప్పుడు తెలుగు టూ స్టేట్స్‌లో వైరల్ టాపిక్ గా మారింది.