దటీజ్ ప్రభాస్ ... దిగొచ్చిన Pvr Pvr Inox Clears Air As 'Dunki' Vs 'Salaar' Intensifies -Tv9

ఇద్దరూ పాన్ ఇండియా స్టార్ హీరోస్.. రెండు భారీ బడ్జెట్ చిత్రాలు. ఒకేసారి విడుదలైతే సినీ పరిశ్రమకుప్ పెద్ద దెబ్బే. అంతేకాదు.. అటు అభిమానులకు సైతం అయోమయమే. ఇద్దరు స్టార్ హీరోస్ సినిమాలు ఒకేరోజు విడుదల కావడం వల్ల ఇటు కలెక్షన్స్ తగ్గే అవకాశం లేకపోలేదు. ఆ ఇద్దరు పాన్ ఇండియా స్టార్స్ ఎవరో కాదు… బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. వీరిద్దరికి ప్రపంచవ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ ఉంది. వీరి సినిమాల కోసం ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు. కానీ ఇప్పుడు ఇద్దరు కలిసి ఒకేసారి అడియన్స్ ముందుకు వచ్చారు. మొదటిరోజే బ్లాక్ బస్టర్ హిట్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. డంకీ సినిమా కేవలం హిందీ భాషలోనే రిలీజ్ అయ్యింది. కానీ సలార్ మాత్రం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో రిలీజ్ అయ్యింది. రెండు భారీ బడ్జెట్ ప్రాజెక్ట్స్ ఒకేసారి విడుదలకావడంతో థియేటర్స్ ఇష్యూ వచ్చింది. ఇష్యూ కాస్త పీవీఆర్ కు సమస్యగా మారింది.