గిరిజనులకు ఇంకా తప్పని డోలి కష్టాలు.. డోలీలోనే గర్భిణీని.. - Tv9

ఇంకెన్నాళ్లీ కష్టాలు.. అభివృద్ధి అంటే పట్టణాలు, నగరాలేనా? మారుమూల పల్లెలు, గూడాలు, తండాలు అభివృద్ధికి నోచుకోవా? రోడ్డు మార్గం అందని కలేనా? అనారోగ్యం పాలైతే డోలియే మార్గామా? ఏజెన్సీలో గర్భిణీల కష్టాలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఆస్పత్రికి వెళ్లేందుకు కనీస సదుపాయాలు లేక, డోలీలనే నమ్ముకోవాల్సి వస్తుంది. తాజాగా అల్లూరి జిల్లాలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది.