టాలీవుడ్ స్టార్ యాక్టర్ కొడుకుతో.. రీతూ చౌదరి న్యూ బిగినింగ్

యాంకర్‌గా కెరీర్ మొదలుపెట్టిన రీతూ చౌదరి.. తన కెరీర్ బిగినింగ్‌లో.. పలు సీరియల్స్, షార్ట్ ఫిల్మ్స్‌లో నటించింది. అయితే జబర్దస్త్ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ తదితర టీవీషోల్లోనూ సందడి చేస్తోందీ. అందంతో పాటు కామెడీ టైమింగ్ తో కుర్రకారును కవ్వించే ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.