మనం ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని రకాల పోషకాలతో నిండిన ఆహారాన్ని రోజూ తినాల్సి ఉంటుంది. మన శరీరానికి అనేక విటమిన్లు, మినరల్స్ అవసరం అవుతాయి. ఇక మన శరీరానికి కావల్సిన మినరల్స్‌లో మెగ్నిషియం కూడా ఒకటి. ఇది మన శరీరంలో ముఖ్యపాత్రను పోషిస్తుంది. కండరాల పనితీరుకు, ఎముకలు ఆరోగ్యంగా ఉండేందుకు మెగ్నిషియం అవసరం అవుతుంది. నిద్ర కూడా బాగా పట్టేలా సహకరిస్తుంది.