పిల్ల వరాహానికి పాలిచ్చిన గోమాత.. వైరల్‌గా మారిన వీడియో చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే.. ఆకలితో అలమటిస్తున్న వరాహానికి గోమాత పాలిచ్చిన వింత ఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. పాతపట్నంలోని రామ మందిరం వద్ద ఓ గోమాత విశ్రాంతి తీసుకుంటోంది. అదే సమయంలో ఆకలితో అలమటిస్తూ వచ్చిన ఓ పిల్ల వరాహం ఎలాంటి భయం లేకుండా గోమాత దగ్గరకు వెళ్లి పాలు తాగింది.