ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ విజయవాడ, కర్నూలు జోన్లలోని వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 606 ఖాళీలను ఈ నోటిఫికేషన్ కింద భర్తీ చేయనుంది. ఆయా ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఎవరైనా ఆన్‌లైన్‌లో నవంబర్ 20, 2024వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. అర్హులైన అభ్యర్థులకు ఎలాంటి రాత పరీక్షా ఉండదు.