పాలు అనేవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పోషకాహారంలో ఒకటి. వీటిలో కాల్షియం అధికంగా ఉండటంతో ఎముకలకు బలాన్ని అందిస్తాయి. పిల్లల ఎదుగుదలలోనూ పాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.