ప్రముఖ సీనియర్ నటుడు, డీఎండీకే అధినేత కెప్టెన్ విజయ కాంత్ మరణం అందరినీ కలచివేసింది. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆయన గురువారం అంటే డిసెంబర్ 28 ఉదయం తుదిశ్వాస విడిచారు. ఇక తమిళనాడు ప్రభుత్వం శుక్రవారం అంటే డిసెంబర్ 29 అధికారిక లాంఛనాలతో విజయ కాంత్ అంత్యక్రియలను నిర్వహించింది. లక్షలాది మంది అభిమానులు, పార్టీ కార్యకర్తలు కెప్టెన్‌కు కన్నీటి వీడ్కోలు పలికారు. కెప్టెన్ అంతిమ సంస్కారాల్లో పలువురు సినీ ప్రముఖులు కూడా పాల్గొన్నారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు తెచ్చుకుని భావోద్వేగానికి గురయ్యారు. సూపర్ స్టార్ రజనీ కాంత్ కూడా తన మిత్రుడిని కడసారి చూసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎమోషనల్ గా మాట్లాడారు.