హైదరాబాద్ సరూర్‌నగర్ కిడ్నీ రాకెట్ కేసులో డొంక కదులుతోంది. పోలీసులు దర్యాప్తు చేసే కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అలకనంద అస్పత్రి ఘటనలో తీగ లాగుతూ కీలక విషయాలు రాబడుతున్నారు. ఈ కేసులో సుమంత్, అవినాష్ అనే ఇద్దరు కీలకంగా వ్యవహరించినట్లు గుర్తించారు. సరూర్‌నగర్ అలకనంద ఆస్పత్రిని సుమంత్ రన్ చేస్తుండగా.. అవినాష్.. డాక్టర్‌గా పని చేస్తున్నట్లు తేల్చారు. అవినాష్‌తోపాటు.. బయట నుండి ఇద్దరు డాక్టర్లను తీసుకొచ్చి కిడ్నీ మార్పిడి సర్జరీలు చేస్తున్నట్లు వెల్లడైంది.