మండుతున్న ఎండలను ఎదుర్కోవాలంటే దానికి తగ్గట్టుగా శరీరానికి ఎలక్ట్రోలైట్లు కావాలి. వేసవిని తట్టుకోడానికి, తక్షణ శక్తని పొందేందుకు కొన్ని రకాల పానీయాలను నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో చూద్దాం.వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగించడంలో మజ్జిక కీలక పాత్ర పోషిస్తుంది. పెరుగులో కొద్దిగా జీలకర్ర, కొత్తిమీర తరుగు, పుదీనా వేసి బాగా చిలికి పల్చని మజ్జిగలా చేసుకొని తాగితే దప్పిక తీరడమే కాకుండా శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది.