బిగ్ బీ అమితాబ్ బచ్చన్ చాలా కాలం తర్వాత తెలుగు అడియన్స్ ముందుకు రాబోతున్నారు. ప్రభాస్ హీరోగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ రూపొందించిన భారీ బడ్జెట్ మూవీ కల్కి 2898 ఏడీ చిత్రంలో అమితాబ్ కీ రోల్లో యాక్ట్ చేస్తున్నారు. భారతీయ పురణాలను ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో ప్రభాస్ అభిమానులకు క్షమాపణలు చెప్పారు బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్.