భర్త 500 రూపాయలు ఇవ్వలేదని.. అలిగి కిటికీ సన్ షేడ్ ఎక్కిన మహిళ

విశాఖ పీఎం పాలెం వైయస్సార్ కాలనీలో కలకలం రేగింది. భర్తపై అలిగి మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. భవనం పైకెక్కి కిటికీ సన్ షేడ్ పై దిగి కూర్చుంది సూరి అనే మహిళ. సమాచారం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టారు.