మరో యోగి రెడీ అవుతున్నారా - Tv9

బీజేపీ మరో హిందుత్వ ముఖచిత్రాన్ని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోపెడుతుందా? రాజస్థాన్ లో బాబా బాలక్‌నాథ్ మరో యోగి కాబోతున్నారా అంటే అవుననే అనిపిస్తోంది. రాజస్థాన్ ఎన్నికల్లో బీజేపీ విజయదుందుబి మోగించడంతో ఈ ప్రచారం జోరందుకుంది. ముఖ్యమంత్రి రేసులో ఉన్న వారిలో ఆల్వార్‌ ఎంపీ, ఆధ్యాత్మిక గురువు బాబా బాలక్‌నాథ్‌ ఒకరు. ఆయన రాజస్థాన్‌ యోగిగా ప్రసిద్ధి చెందారు. ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లా కాషాయ దుస్తులు ధరించే బాబా బాలక్‌నాథ్‌యే ఇప్పుడు రాజస్థాన్ ముఖ్యమంత్రిఅయ్యే అవకాశం ఉందనే చర్చ సర్వత్రా జరగుతోంది.