మంగళహారతిలో డబ్బులు.. మంత్రి సత్యవతి రాథోడ్ పై కేసు నమోదు Telangana Elections 2023 - Tv9

మహబూబాబాద్‌జిల్లాలో మంత్రి సత్యవతి రాథోడ్‌పై కేసు నమోదయ్యింది. గిరిజన మహిళలకు హారతి పళ్లెంలో మంత్రి డబ్బులు పెట్టిన దృశ్యాలు మీడియా కెమరాలకు చిక్కాయి. ప్రజలకు డబ్బులు పంచి ప్రలోభానికి గురిచేశారంటూ మంత్రిపై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు అందింది. కొంగరగిద్ద ప్రచారంలో కోడ్‌ ఉల్లంఘించారంటూ మంత్రి సత్యవతిపై కేసు నమోదు చేశారు. గూడూరు పీఎస్‌లో 171-E, H, రెడ్‌విత్ 188 కింద కేసు నమోదయ్యింది.