బ్రో.. నీ ఐడియా సూపర్‌..వీడియో

తెలివితేటలకి చదువుకి సంబంధం ఉండదు. కొందరు తమ బుద్ధిబలంతో కొత్త కొత్త ఆవిష్రణలు చేస్తుంటారు. ఇలాంటి జుగాడ్‌లు సోషల్ మీడియాలో తరచూ చూస్తుంటాం. ఇలాంటి అద్భుతమైన ఆలోచనలు ఇండియన్స్‌కే వస్తాయంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. తాజాగా అలాంటిదే మరో వీడియో సోషల్‌ మీడియాలోవైరల్‌ అవుతోంది. ఓ వ్యక్తి తన వద్ద వాటర్‌ డిస్పెన్సర్‌ లేకపోవడంతో అంత పెద్ద క్యాను నుంచి ప్రతిసారీ నీళ్లు గ్లాసులోకి వంపుకోవడం కష్టంగామారింది. దీంతో అతనికి ఒక ఐడియా వచ్చింది. వెంటనే అమలు చేసేసాడు.