తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ తన గన్‌మెన్‌పై చేయిచేసుకున్న ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. 24 గంటలు కంటికి రెప్పలా కాపాడే.. గన్‌మెన్ పట్ల మహమ్మద్ అలీ తీరుపై చాలామంది ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అలీ తీరును తప్పుపడుతూ సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో తన గన్‌మెన్‌పై చేయిచేసుకున్న ఘటనపై హోంమంత్రి మహమూద్ అలీ స్పందించారు