యూకేలో పనిమంతులుగా ఆటిజం వ్యక్తులు - Tv9

ఆటిజం ఉన్న వ్యక్తుల తీరే విభిన్నం. స్పెషల్‌ నీడ్స్‌ ఉన్న వీరికి ఉద్యోగాలు ఇచ్చి జీవితంపై ఆశ కల్పించే ఉద్దేశ్యంతో ఏకంగా ఓ చాక్లెట్‌ ఫ్యాక్టరీనే స్థాపించారు పాకిస్తాన్‌కు చెందిన ఓ జంట. ఆటిజంతో బాధపడుతున్న తమ కుమారుడికి జాబ్‌ ఇవ్వాలన్న సంకల్పంతో పాకిస్తాన్‌కు చెందిన దంపతులు ప్రారంభించిన చాక్లెట్‌ ఫ్యాక్టరీ మరో మూడు వేల మందికి ఆసరా అందించింది. ఆ మూడు వేల మంది ఆటిజం బాధితులే కావడం విశేషం.