ఆ లెటర్ చూసి ఆశ్చర్యపోయాను Allu Arjun @Tv9telugudigital

దుబాయ్‌లోని మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో తన మైనపు విగ్రహం ఏర్పాటు చేయడంపై తాజాగా ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ స్పందించారు. మేడమ్‌ టుస్సాడ్స్‌ నుంచి వచ్చిన ఆహ్వానం చూసి తొలుత ఆశ్చర్యపోయానన్నారు బన్నీ. ఓరోజు తాను ఆఫీస్‌కు వెళ్లగానే అక్కడున్నవాళ్లంతా నిలబడి తనను చూసి నవ్వుతున్నారని, ఏం జరుగుతుందో అర్థం కాక చూస్తుంటే తనకు ఓ లెటర్‌ ఇచ్చారని చెప్పారు.