బ్రహ్మం గారు ఏం చెప్పారంటే Yaganti Basavanna - Tv9

నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణానికి 14 కిలోమీటర్ల దూరంలో ఎర్రమల కొండల్లో ప్రకృతి రమణీయతల మధ్య యాగంటి క్షేత్రం కొలువై ఉంది. కార్తీక మాసంలో యాగంటి క్షేత్రానికి భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేస్తుంటారు. యాగంటి దేవాలయంలో ఉన్న నందీశ్వరునికి ఓ ప్రత్యేకత ఉంది ఆలయంలో ఈశాన్య భాగంలో నందీశ్వరుడు కొలువై ఉండడం ... ఆ నంది విగ్రహం అంతకంతకు పెరుగుతూ ఉండడం ఇక్కడి ప్రత్యేకత... పురావస్తు శాఖ అంచనా ప్రకారం ఈ నంది విగ్రహం ప్రతి 20 సంవత్సరాలకు అంగుళం మేర పెరుగుతూ వస్తోంది. అంతేకాదు.. 90 సంవత్సరాల క్రితం ఈ నంది చుట్టూ ప్రదక్షిణలు చేసేవారట, ఇప్పుడు అది పెరిగిపోవడంతో ప్రదక్షిణాలకు స్థలం పూర్తిగా తగ్గడం.. దీంతో నంది చుట్టూ భక్తులు ప్రదక్షిణలు చేసేందుకు వీలు పడడం లేదు. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో యాగంటి బసవయ్య ప్రస్తావన తీసుకొచ్చారు. అంతకంతకూ పెరిగి రంకె వేస్తుందనీ కలియుగం అంతమవుతుందనీ రాశారు. భవిష్యత్‌లో ఇదే జరగనుందనీ ఇక్కడి భక్తులు విశ్వసిస్తారు. ఆంధ్రప్రదేశ్ తో పాటు చుట్టుపక్కల రాష్ట్రాల నుండి కూడా భక్తులు ఈ క్షేత్రానికి వస్తుంటారు.