సలార్ రిలీజ్ అయి.. సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న వేళ.. హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద అభిమానులు ఓ రేంజ్‌లో సందడి చేశారు. థియేటర్ ముందు అంటే పార్కింగ్ ఏరయాను పబ్ గా మార్చేసి.. రచ్చ రచ్చ చేశారు. ఎస్ ! సలార్ సినిమా విడుదల సందర్భంగా థియేటర్ వద్ద మ్యూజిక్ కాన్సర్ట్ జరుగుతున్నప్పుడు లైటింగ్స్, హోర్డింగ్స్, సౌండ్ సిస్టం అన్నీ ఏర్పాటు చేశారు. అర్థరాత్రి ఒంటిగంట ప్రీమియర్ షో పడే వరకు ఒక మినీ మ్యుూజికల్ కాన్సర్ట్ నడిపారు. ప్రభాస్ పాటలతో రెబల్ స్టార్ అభిమానులు డాన్స్ చేశారు. ప్రభాస్ మేనియాతో ఊగిపోయారు. దాంతో పాటే ఇందుకు సంబంధించిన వీడియోస్‌తో నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు డార్లింగ్ ఫ్యాన్స్.