యోగా ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతారు. అందుకే వైద్యులు సైతం యోగా చేయమని సూచిస్తుంటారు. ఈ యోగాతో కళలను కూడా ప్రదర్శించవచ్చంటున్నారు ఆథ్యాత్మిక యోగా గురువు సచ్చిదానంద యోగి. యోగాలోని నౌలి క్రియ ద్వారా గతంలో కూడా అకే కళాఖండాలను తన పొట్టపై ప్రదర్శించారు సచ్చిదానంద. తాజాగా శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారి 9 రూపాలను తన పొట్టపై చిత్రించుకుని అద్భుత ప్రదర్శన ఇచ్చారు.