రమాప్రభకు రాజేంద్ర ప్రసాద్ ఏమవుతాడో తెలుసా

సీనియర్ నటీమణి రమా ప్రభ గురించి తెలుగు ఆడియెన్స కు పరిచయం అక్కర్లేదు. కెరీర్ ప్రారంభంలో హీరోయిన్ గానూ నటించిన ఈ అందాల తార ఆ తర్వాత లేడీ కమెడియన్ గా తెలుగు ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి దిగ్గజ నటీనటులతో కలిసి నటించిన ఘనత రమా ప్రభ సొంతం. ఇక శరత్ బాబుతో పెళ్ళి, విడాకులు రమా ప్రభ జీవితాన్ని మరో మలుపు తిప్పాయి. ఆ మధ్యన ఈ సీనియర్ నటి ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితులపై పలు రకాల పుకార్లు తెర మీదకు వచ్చాయి. అయితే అవన్నీ అబద్ధాలేనని తాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని ఆమె చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి దూరంగా తన సోదరుడి కుటుంబంతో కలిసి ఉంటోందీ సీనియర్ నటి.చెల్లెలి కూతురిని దత్తత తీసుకుని, పెంచి, పెళ్లి చేసి..ఇక రాజేంద్ర ప్రసాద్ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కామెడీ హీరోగా ఎన్నో సినిమాల్లో నటించాడు. ఇప్పటికీ సపోర్టింగ్ రోల్స్ తో ఆడియెన్స్ ను మెప్పిస్తున్నాడు.