ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో షాకిచ్చింది. రాత్రి వేళల్లో టికెట్‌పై ప్రయాణికులకు ఇచ్చే రాయితీని ఎత్తివేసింది. అవును..బయట ఎండలు మండిపోతున్నాయి. బస్సుల్లో, బైకుల్లో ప్రయాణించే పరిస్థితి లేదు. దాంతో ఎక్కువమంది మెట్రో ట్రైన్‌లో ప్రయాణానికే మొగ్గుచూపుతున్నారు. ఇప్పడు వీరందరికీ షాకిస్తూ టికెట్‌పై ఇప్పటి వరకూ ఇస్తున్న రాయితీని ఎత్తివేసింది. దీంతో ప్రయాణికులు మండిపడుతున్నారు.