Viral మహానగరాన్ని వణికించిన పిల్లి! - Tv9

ఓ పిల్లి కారణంగా మహానగరం వణికిపోతోంది. ఎప్పుడు.. ఏం వార్త వినాల్సి వస్తుందోనని జనం హడలెత్తిపోతున్నారు. కారణం.. ఆ పిల్లి ప్రమాదకరమైన రసాయనాల ట్యాంక్‌లో పడ్డాక అక్కడి నుంచి కనిపించకుండా పోవడమే. దీంతో ఆ పిల్లి క్యాన్సర్‌ కారక రసాయనాన్ని అంతటా వెదజల్లుతుందనే భయం ఆ నగరంలో నెలకొంది. జపాన్‌ హిరోషిమాలోని ఫుకుయామా అధికారులు ఆ పిల్లిని వెదికేందుకు పెట్రోలింగ్‌ను మరింతగా పెంచారు.