శ భాష్ ష మీ.. రోడ్డు ప్రమాదం.. బాధితుడిని కాపాడిన భారత్ ఫేసర్ @Tv9telugudigital

భార‌త సీనియ‌ర్ పేస‌ర్ మ‌హ్మద్ ష‌మీ మాన‌వ‌త్వం చాటుకున్నాడు. రోడ్డు ప్రమాదం బారిన పడ్డ ఓ వ్యక్తిని షమీ రక్షించాడు. ఈ విషయాన్ని అతనే స్వయంగా నెట్టింట షేర్‌ చేస్తూ... అతడు చాలా అదృష్టవంతుడు. దేవుడు అతడికి పునర్జన్మనిచ్చాడు. నైనిటాల్‌లో ఘాట్ రోడ్డు మీదుగా ప్రయాణిస్తున్న మా కారు ముందు మరో కారు వేగంగా దూసుకెళ్తోంది. ఈ క్రమంలో ఆ కారు అదుపు తప్పి పక్కనే ఉన్న చిన్నపాటి లోయలోకి వెళ్లిపోయింది.