కరోనా కష్టకాలంలో వేలాదిమందిని ఆదుకున్న బాలీవుడ్ ప్రముఖ నటుడు సోనూ సూద్ ఆ తర్వాత కూడా ఎంతోమందిని ఆదుకున్నారు. సాయం కోరినవారిని లేదనకుండా అక్కున చేర్చుకున్న అతడి మంచి హృదయానికి దేశం మొత్తం ఫిదా అయింది. తాజాగా ఆయన పేరు మరోమారు వార్తలకెక్కింది. ఓ కస్టమర్ ఇంటి బయట ఉన్న బూట్లను చోరీ చేసిన స్విగ్గీ డెలివరీ బాయ్ వీడియో ఇటీవలే సోషల్ మీడియాలో వైరల్ అయింది.