డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన యానిమల్ చిత్రం భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ సెన్సెషన్ క్రియేట్ చేస్తుంది. డిసెంబర్ 1న విడుదలైన ఈ చిత్రం ఇప్పటివరకు దాదాపు 800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇందులో రణబీర్ కపూర్, అనీల్ కపూర్, రష్మిక మందన్నా, త్రిప్తి డిమ్రి, బాబీ డియోల్ ప్రధాన పాత్రలు పోషించారు. తండ్రికొడుకుల అనుబంధం నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే భారీ వసూళ్లతో దూసుకుపోతున్న ఈ సినిమాకు సెకండ్ పార్ట్ రాబోతుందని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రకటించారు. అంతే కాకుండా యానిమల్ సినిమా రెండో భాగం పేరు యానిమల్ పార్క్ అని తెలిపారు. హిందీలో చిత్రీకరించిన ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లోనూ రిలీజ్ చేయగా.. పాన్ ఇండియా స్థాయిలో సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ సినిమాకు సౌత్, నార్త్ అడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా ఇంతకు మునుపెన్నడూ చూడని పాత్రలో రణబీర్ అద్భుతమైన నటన కనబరిచాడని పొగడ్తలు కురిపిస్తున్నారు.