వినూత్న ఆలోచనలు, కార్యక్రమాలతో జిల్లా పాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు ఆ జిల్లా పాలనాధికారి. విద్యా విషయాల్లో ఆయన చొరవే వేరు. ఇప్పటికే ఆ అధికారి చాక్ పీస్ పట్టి పాఠాలు బోధించారు. గరిటె చేత పట్టి విద్యార్థులకు భోజనం వడ్డించారు. విద్యార్థులతో హాస్టల్లో రాత్రి బస చేస్తున్నాడు. తాజాగా తెల్లవారుజామున ఓ విద్యార్థి ఇంటి తలుపు తట్టిన ఆ అధికారి ఏం చేశారో.. చూడండి. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ గా హనుమంతరావు వచ్చిన కొద్ది రోజుల్లోనే పనితీరులో తనదైన ముద్ర వేస్తున్నారు. ఆకస్మిక తనిఖీలతో హల్చల్ చేస్తున్నారు. విద్య ద్వారానే సమాజం అభివృద్ధి చెందుతుందని నమ్మి విద్యాశాఖపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా తరచూ ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేస్తూ ఉపాధ్యాయుల పనితీరు, విద్యార్థుల ప్రతిభను తెలుసుకుంటున్నారు.