ఏప్రిల్ 22 నుంచి ఆ రైళ్లు సికింద్రాబాద్ స్టేషన్ వరకు వెళ్లవు
చర్లపల్లి రైల్వే స్టేషన్ ప్రారంభం కావడంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌పై రద్దీభారం పడకుండా దక్షిణమధ్య రైల్వే చర్యలు ప్రారంభించింది. కొన్ని రైళ్లను సికింద్రాబాద్ వరకు కాకుండా చర్లపల్లి వరకే పరిమితం చేయాలని నిర్ణయించింది.