500 ఏళ్ల కల నెరవేరే ఆ మధుర క్షణాలు పూర్తయ్యాయి. అయోధ్యలో శ్రీరామ జన్మభూమిలో నిర్మించిన ఆలయాన్ని జనవరి 22న ప్రధాని మోదీ ప్రారంభించారు. శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కిన రామ్ లల్లాను ఆలయంలో ప్రతిష్ఠించారు. అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠ జరిగిన రోజునే నొయిడా సమీపంలో మరో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఇక్కడి బిస్రఖ్ గ్రామంలో రావణుడిని ఆరాధించే ఓ పురాతన శివాలయంలో స్థానికులు సీతారాముడు, లక్ష్మణుల విగ్రహాలను ప్రతిష్ఠించారు.