దేశంలో రూ.2వేల నోట్లను 2023 మే 19న ఉపసంహరించినట్లు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించిన విషయం తెలిసిందే. ఆర్బీఐ ప్రకటన చేసే నాటికి దేశంలో 3.56లక్షల కోట్ల విలువైన 2వేల రూపాయల నోట్లు చలామణిలో ఉన్నాయి. ఆర్బీఐ ప్రకటన నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ప్రజలు, సంస్థలు, ప్రముఖులు వారి వద్ద ఉన్న రూ.2వేల నోట్లను బ్యాంక్‌లలో డిపాజిట్ లేదా ఎక్చేంజ్ చేసుకున్నారు.