సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తమిళనాడులోని తంజావురు జిల్లా కుంభకోణం సమీపంలోని తిరునాగేశ్వరం నాగనాథస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. రాహు పరిహార ప్రత్యేక పూజలకు పేరొందిన ఆలయంలో.. స్వామివారికి నిర్వహించిన ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. దేవాలయం అధికారులు బాలకృష్ణకు ఘనంగా స్వాగతం పలికారు.