సాధారణంగా ఎవరైనా వెండి, బంగారం, వజ్రాలతో తయారుచేసిన ఆభరణాలను ఎక్కువగా ధరిస్తూ ఉంటారు. అయితే చాలా తక్కువ మంది మాత్రమే రాగితో తయారు చేసిన వస్తువులను వాడుతుంటారు. రాగి ఉంగరాన్ని ధరించే సంప్రదాయం పురాతన కాలం నుంచి కొనసాగుతోంది. జ్యోతిషశాస్త్రంలో, రాగి ఉంగరాన్ని ధరించడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. రాగి ఉంగరాన్ని ధరించడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది.