వరలక్ష్మి వ్రతం వస్తుందంటే మహిళలకు ఎంతో సందడి. శ్రావణమాసంలో రెండవ శుక్రవారం వచ్చే వరలక్ష్మీ వ్రతం ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అంబెడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం ఇందుపల్లి గ్రామానికి చెందిన పేరి ఫణి కుమారి వరలక్ష్మీ వ్రతం పూజకు సంబంధించి సొంతంగా విగ్రహాలను తయారు చేయడంతో పాటు వివిధ డెకరేషన్ ఐటమ్స్ ను రూపొందించారు.