అఘోరీతో బీటెక్‌ యువతి జంప్‌..మరో అఘోరీగా మారబోతుందా

తెలుగు రాష్ట్రాల్లో లేడీ అఘోరీ గురించి తెలియని వారు ఉండరు. ఆ మధ్య ఆమె వరుసగా ఆలయాలకు వెళ్లి అక్కడ నానా హంగామా చేసింది. అయితే కొద్దిరోజులుగా ఆమె పెద్దగా కనిపించడం లేదు. అయితే తాజాగా గుంటూరు జిల్లా మంగళగిరిలో బిటెక్ చదువుతున్న విద్యార్థిని అఘోరీగా మారటానికి ఇంటిలో నుంచి వెళ్ళిపోవడం కలకలం రేపుతోంది. ప్రియదర్శిని కాలేజ్ లో బిటెక్ చదివిన విద్యార్థినికి కొన్ని రోజుల క్రితం మంగళగిరికి వచ్చిన లేడీ అఘోరీతో పరిచయం ఏర్పడింది.