గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి సంక్రాంతికి బోలెడన్ని సినిమాలు రిలీజ్ కానున్నాయి. మొదట తెలుగులోనే ఏకంగా ఐదు సినిమాలు పొంగల్ బరిలో నిలిచాయి. పైగా అన్నీ స్టార్ హీరోల సినిమాలే. దీంతో థియేటర్లను వెతుక్కోవడం నిర్మాతలకు తలకు మించిన భారంగా మారింది. దీంతో ముందు జాగ్రత్తగా రవితేజ ఈగల్ సినిమా సంక్రాంతి రేసు నుంచి తప్పుకుంది. ప్రస్తుతం నాలుగు సినిమాలు పొంగల్ రేసులో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. వీటికి కూడా థియేటర్ల కేటాయింపుపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. అయితే తెలుగు సినిమాలకు తోడు ఈసారి రెండు తమిళ చిత్రాలు కూడా సంక్రాంతికి వద్దామనుకున్నాయి. అందులో ఒకటి ధనుష్ కెప్టెన్ మిల్లర్ కాగా, మరొకటి శివ కార్తికేయన్ నటించిన అయలాన్.