ఏపీ మెగా డీఎస్సీ వాయిదా..కారణం ఏంటంటే.. Ap Mega Dsc

రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న మెగా డీఎస్సీ 2024 ప్రకటన వాయిదా పడింది. షెడ్యూల్‌ ప్రకారం బుధవారం డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల కావాల్సి ఉంది. సాంకేతిక కారణాలతో వాయిదా వేస్తున్నట్టు విద్యాశాఖ ప్రకటించింది. మళ్లీ మూడు రోజుల్లో నోటిఫికేషన్‌ విడుదల చేస్తారు. సోమవారం టెట్‌ ఫలితాలను ప్రకటించారు అధికారులు.