అల్లూరి జిల్లా అరకు లోయ అటవీశాఖ క్వార్టర్స్‌లో విషాదం చోటుచేసుకుంది. నానమ్మ చిలకమ్మ, మనవడు నాని అనుమానాస్పదంగా మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అటవీశాఖ క్వార్టర్స్‌లో సుమారు గత ఎనిమిది ఏళ్లకుపైగా కొర్ర చిలకమ్మ కుటుంబం నివాసం ఉంటుంది. స్థానికంగా కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. శనివారం కూలి పనుల తర్వాత ఇంటికి వచ్చి భోజనాలు ముగించుకొని నిద్రకు ఉపక్రమించారు.