భర్తను హత్య చేసి..ప్రియుడితో హోటల్‌లో ఆరు రోజుల పాటు..!

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరఠ్‌లో మర్చంట్ నేవీ మాజీ అధికారి సౌరభ్‌ రాజ్‌పుత్‌ హత్య కేసులో ఇంట్రెస్టింగ్‌ అంశాలు బయటకు వచ్చాయి. హత్య తర్వాత తమ కదలికలను ఎవ్వరూ గుర్తించకుండా భార్య ముస్కాన్‌, ఆమె ప్రియుడు భార్యా భర్తలుగా చెప్పుకుని ఆరు రోజులు హిమాచల్‌ప్రదేశ్‌ కసోల్‌లోని ఓ హోటల్‌లో గడిపినట్లు తెలిసింది. ప్రియుడు సాహిల్‌తో కలిసి భర్త సౌరభ్‌ శుక్లాను మార్చి 4న ముస్కాన్‌ హత్య చేసింది. మత్తుమందు ఇచ్చి దారుణానికి ఒడిగట్టింది.