ఆ ఆఫీసంతా నోట్ల కట్టలే.. ఎక్కడ చూసినా గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన కరెన్సీ బండల్స్.. 40 మంది సిబ్బంది 40 మిషన్స్‌తో లెక్కిస్తున్నా ఒడవడం లేదు. ఒడిషాలోని బాలంగిర్‌లో కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహుకు సంబంధించిన అక్రమ సంపాదనను ఆరురోజులుగా లెక్కిస్తూనే ఉన్నారు. ఒక రూమ్ నిండా అల్మరాల్లో బయటపడ్డ కరెన్సీ కట్టల్ని 40 మంది ఐటీ సిబ్బంది, బ్యాంక్ సిబ్బంది లెక్కిస్తున్నారు. దీనికోసం తెప్పించిన 40 నోట్ల లెక్కింపు యంత్రాలు సరిపోక.. కొత్తగా కౌంటింగ్ మెషిన్లను కొనుగోలు చేశారు. మొత్తం 200 బ్యాగులుంటే వాటిలో నిన్నటికి 175 బ్యాగుల్లో లెక్కింపు పూర్తయ్యింది. ఇప్పటివరకు ఐటీ అధికారులు సీజ్ చేసిన రొక్కం అక్షరాలా రూ. 300 కోట్లు.