తల దువ్వుకున్నప్పుడు నాలుగు వెంట్రుకలు రాలిపోతేనే చాలా మంది కలవరానికి గురవుతుంటారు. అమ్మో జుట్టు రాలిపోతోందని ఎంతో అందోళన చెందుతారు. ఎందుకంటే జుట్టు అందానికే కాదు.. ఆత్మవిశ్వాసానికి ప్రతీక. ఒత్తయిన జుట్టు ఉన్నవారికి అందంతో పాటు ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటుందని సైకాలజిస్టులు చెబుతుంటారు. అందుకే జుట్టు ఆరోగ్యం కోసం అనేక రకాల కేశసంరక్షణ చర్యలు తీసుకుంటూ ఉంటారు. అలాంటి జుట్టు సడన్ గా ఊడిపోతే.. అది కూడా ఓ వారం రోజుల్లోనే మొత్తం వెంట్రుకలు రాలిపోయి.. బట్టతల వస్తే..? ఇలా ఎలా జరుగుతుంది అంటారా.. ఆ గ్రామంలో అలాగే జరుగుతోంది.