అంతర్జాతీయంగా, దేశీయంగా గిరాకీ తగ్గడంతో బంగారం, వెండి ధరలు కొంతమేర దిగి వచ్చాయి. అంతర్జాతీయ విపణిలో ఔన్సు బంగారం ధర బుధవారం ఒక్కరోజే 75 డాలర్ల మేర తగ్గి 2660 డాలర్లకు చేరింది. ఫలితంగా హైదరాబాద్ బులియన్ విపణిలో బుధవారం 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.80,000 కంటే దిగి, రూ.79,100కు చేరింది. కిలో వెండి ధర కూడా రూ.92,700కు చేరింది.