అలర్ట్‌.. ఏప్రిల్‌లో 13 రోజులు బ్యాంకులకు సెలవు!

మరో 5 రోజుల్లో మార్చి నెల ముగిసి, ఏప్రిల్ నెల ప్రారంభం అవుతుంది. ఈ నేపథ్యంలో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి నెలా మాదిరిగానే వచ్చే నెలకు సంబంధించిన బ్యాంకు సెలవులను ప్రకటించింది. ఈ నెలలో ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు, బ్యాంకులు చాలా రోజులు మూసి ఉండనున్నాయి. బ్యాంకుకు సంబంధించిన ఏదైనా ముఖ్యమైన పని ఉంటే ఏప్రిల్‌ నెలలో బ్యాంకులకు ఏయే రోజులో సెలవు ఉంటుందో ముందస్తుగా తెలుసుకోవడం చాలా ముఖ్యం. దీనివల్ల వినియోగదారుల సమయం ఆదా అవడమే కాకుండా అందుకు అనుగుణంగా ప్లాన్‌ చేసుకునే అవకాశం ఉంటుంది.