సాధారణంగా సూర్య,చంద్రగ్రహణాలు ఏర్పడినప్పుడు అన్ని దేవాలయాలను మూసి వేస్తారు. గ్రహణ కాలం పూర్తియిన తర్వాత ఆలయ సంప్రోక్షణ చేసి యధావిధిగా పూజాదికాలునిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా ఇలా ఆలయాలను మూసి వేసినా.. గ్రహణ దోషం లేని రాహుకేతు క్షేత్రంగా విరాజుల్లుతున్న ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాళహస్తి ఆలయాన్ని మాత్రం మూయరు.